అభిషేక్, క్లాసెన్ అర్ధసెంచరీలు.. అయినా 200 దాటని సన్‌రైజర్స్!
- చెన్నై సూపర్ కింగ్స్‌కు 195 పరుగుల లక్ష్యం నిర్దేశించిన సన్‌రైజర్స్
- అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ అద్భుత అర్ధసెంచరీలు
- మిగతా బ్యాటర్ల నుంచి అందని సహకారం.. 200 దాటని స్కోరు
- చెన్నై బౌలర్లలో చెరో మూడు వికెట్లు తీసిన కాంభోజ్, ఓవర్టన్
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ, స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుత అర్ధసెంచరీలతో రాణించినప్పటికీ, మిగతా బ్యాటర్ల నుంచి సహకారం కొరవడటంతో 200 పరుగుల మార్కును అందుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్ అభిషేక్ శర్మ (22 బంతుల్లో 59; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఆరంభం అందించాడు. పవర్‌ప్లేలో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, మంచి ఊపు మీదున్న జట్టును ముఖేష్ చౌదరి దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్‌లో ట్రావిస్ హెడ్ (23), కెప్టెన్ ఇషాన్ కిషన్ (0)ను ఔట్ చేసి రైజర్స్ జోరుకు బ్రేకులు వేశాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి తన క్లాస్ చూపించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేస్తూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. అయితే, మరో ఎండ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (12), లియామ్ లివింగ్‌స్టోన్ (1) వంటి కీలక బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు ఆశలకు గండిపడింది. శివాంగ్ కుమార్ 12 పరుగులు సాధించాడు.
చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంభోజ్, జేమీ ఓవర్టన్ అద్భుతంగా రాణించి చెరో 3 వికెట్లు పడగొట్టారు. ముఖేష్ చౌదరి 2 వికెట్లు తీశాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రైజర్స్‌ను 194 పరుగులకే కట్టడి చేయగలిగారు.